GMC Ananthapuramu Recruitment 2026: అనంతపురం జిల్లాలోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMC Ananthapuramu) డ్రగ్ డీ-అడిక్షన్ సెంటర్‌లో కాంట్రాక్ట్ ఆధారంగా కౌన్సెలర్, ANM, సైకియాట్రిస్ట్/ఎంబీబీఎస్ డాక్టర్, వార్డ్ బాయ్ పోస్టుల భర్తీకి ఆఫ్‌లైన్ దరఖాస్తులు కోరుతోంది. మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చివరి తేదీ జనవరి 07, 2026.

GMC Ananthapuramu Recruitment 2026 ముఖ్యమైన తేదీలు
| వివరణ | తేదీ |
|---|---|
| ఆఫ్‌లైన్ దరఖాస్తు ప్రారంభం | 31-12-2025 |
| దరఖాస్తు చివరి తేదీ | 07-01-2026 |
ఖాళీల వివరాలు & అర్హతలు
| పోస్టు పేరు | ఖాళీల సంఖ్య | అర్హత (కనీసం) | జెండర్ అర్హత |
|---|---|---|---|
| సైకియాట్రిస్ట్ / MBBS డాక్టర్ | 1 | MBBS డిగ్రీ (అదనంగా అడిక్షన్ మెడిసిన్ శిక్షణ ఉంటే మంచిది) | మగ / ఆడ ఇద్దరూ అర్హులే |
| నర్స్ (ANM) | 1 | 12వ తరగతి + MPHA(F) లేదా 2 సంవత్సరాల ఇంటర్ వొకేషనల్ MPHW(F) కోర్సు | మహిళలు మాత్రమే |
| కౌన్సెలర్ | 2 | డిగ్రీ / గ్రాడ్యుయేషన్ | మగ / ఆడ ఇద్దరూ అర్హులే |
| వార్డ్ బాయ్ | 1 | 8వ తరగతి పాస్ | పురుషులు మాత్రమే |
వయస్సు పరిమితి (01-07-2025 నాటికి):
కనీసం 18 సంవత్సరాలు, గరిష్టం 42 సంవత్సరాలు.
ఎక్స్-సర్వీస్‌మెన్ & PH అభ్యర్థులకు 8 సంవత్సరాలు, SC/ST/BC అభ్యర్థులకు 5 సంవత్సరాలు సడలింపు ఉంది.
జీతం వివరాలు (నెలకు)
| పోస్టు పేరు | జీతం (రూ.) |
|---|---|
| సైకియాట్రిస్ట్ / MBBS డాక్టర్ | 60,000 |
| కౌన్సెలర్ | 12,500 |
| నర్స్ (ANM) | 11,000 |
| వార్డ్ బాయ్ | 11,000 |
ఎంపిక ప్రక్రియ
ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు చేసే విధానం
ఆన్‌లైన్‌లో దరఖాస్తు లేదు. ఆఫ్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
అర్హత ఉన్న అభ్యర్థులు క్రింది స్టెప్స్‌ను అనుసరించండి:
- అధికారిక వెబ్‌సైట్‌లో నుంచి నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారమ్ డౌన్‌లోడ్ చేసుకోండి.
- ఫారమ్‌ను సరిగ్గా నింపి, అవసరమైన సర్టిఫికెట్లతో (స్వీయ ధృవీకరణ చేసి) జత చేయండి.
- దరఖాస్తును ప్రిన్సిపాల్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అనంతపురం కార్యాలయానికి పర్సనల్‌గా లేదా రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా 07-01-2026 సాయంత్రం 5 గంటలలోపు సమర్పించండి.
ముఖ్యమైన లింకులు
| వివరణ | లింక్ |
|---|---|
| అధికారిక నోటిఫికేషన్ & అప్లికేషన్ ఫారమ్ | Click Here |
| అధికారిక వెబ్‌సైట్ | ananthapuramu.ap.gov.in |