Anganwadi Recruitment 2026: ఇంటర్ లేదా 12th అర్హతతో 60+ అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు
Telangana Anganwadi Teacher Recruitment 2026 Peddapalli: పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ టీచర్ (AWT) ఉద్యోగాలు భర్తీ చేయడానికి అధికారిక నోటిఫికేషన్ విడుదలైంది. రాత పరీక్ష లేకుండా ఇంటర్మీడియట్ అర్హతతో మహిళలు సులభంగా అప్లై చేసుకోవచ్చు. 20 జూన్ 2026 నుంచి 6 జూలై 2026 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇది మీకు స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకుంటే ఇప్పుడే అవకాశం.
You can still apply for this job. Please submit before the deadline.

పెద్దపల్లి జిల్లా ICDS ప్రాజెక్టుల్లో అంగన్వాడీ టీచర్ ఖాళీలు భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 60+ పోస్టులు ఉన్నాయి. ఎంపిక ప్రక్రియలో రాత పరీక్ష లేదు. ఇంటర్ మార్కులు, వితంతువు, అనాథ, వికలాంగులు, ఇంటర్వ్యూ ఆధారంగా మెరిట్ లిస్ట్ తయారవుతుంది.
Telangana Anganwadi Teacher Recruitment 2026 Peddapalli Overivew
| అంశం | వివరాలు |
|---|---|
| జిల్లా | పెద్దపల్లి (Peddapalli) |
| పోస్టు | Anganwadi Teacher (AWT) |
| మొత్తం ఖాళీలు | 60+ (Peddapalli, Ramagundam, Manthani ప్రాజెక్టులు) |
| అర్హత | Intermediate / 12th Pass |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ మాత్రమే |
| ఆన్‌లైన్ ప్రారంభం | 20.06.2026 |
| చివరి తేదీ | 06.07.2026 (సాయంత్రం 5:00) |
Eligibility Criteria
అంగన్వాడీ టీచర్ పోస్టుకు అర్హులు కావాలంటే కింది అర్హతలు ఉండాలి:
- విద్యార్హత: ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పాస్.
- వయసు: 18 నుంచి 35 ఏళ్ల మధ్య (సాధారణ నిబంధనల ప్రకారం).
- స్థానికత: ఆంగన్‌వాడీ సెంటర్ ఉన్న గ్రామ పంచాయతీ / వార్డు లో స్థానిక మహిళా అయి ఉండాలి.
- రిజర్వేషన్: SC/ST/BC/EWS వర్గాలకు రోస్టర్ ప్రకారం రిజర్వేషన్ అమలు. కొన్ని పోస్టులు వికలాంగులు (VH, HH), ఎక్స్-సర్వీస్ మెన్ కోసం కేటాయించబడ్డాయి.
- ST/SC హాబిటేషన్ పోస్టులకు సంబంధిత కులం అభ్యర్థులు మాత్రమే అర్హులు.
Salary Insight
అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం నిర్ణయించిన గౌరవ వేతనం (Honorarium) చెల్లించబడుతుంది. ఇది కాలానుగుణంగా మారుతుంటుంది. ప్రస్తుతం రాష్ట్రంలో AWTలకు సగటు నెలవారీ గౌరవ వేతనం సుమారు ₹5,000 నుంచి ₹7,500 వరకు ఉంటుంది. అదనంగా ఇతర ప్రోత్సాహకాలు కూడా లభిస్తాయి.
How to apply Telangana Anganwadi Teacher Recruitment 2026 Peddapalli
- అధికారిక వెబ్‌సైట్ http://wdcw.tg.nic.in కి వెళ్లండి.
- Anganwadi Teacher Recruitment 2026 లింక్‌ను క్లిక్ చేయండి.
- ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను తెరిచి అన్ని వివరాలు (వ్యక్తిగత, విద్యా, రిజర్వేషన్) సరిగ్గా నింపండి.
- అవసరమైన పత్రాలు (ఫోటో, సంతకం, ఇంటర్ మెమోలు, కులం సర్టిఫికెట్ మొ.) అప్‌లోడ్ చేయండి.
- దరఖాస్తు ఫీజు (ఉంటే) చెల్లించి సమర్పించండి.
- సమర్పించిన అప్లికేషన్‌ను ప్రింట్ తీసుకొని భవిష్యత్తు కోసం భద్రపరచుకోండి.
Important Dates
| ఈవెంట్ | తేదీ |
|---|---|
| దరఖాస్తు ప్రారంభం | 20 జూన్ 2026 |
| దరఖాస్తు చివరి తేదీ | 06 జూలై 2026 (5:00 PM) |
| ఎంపిక ప్రక్రియ | త్వరలో ప్రకటించబడుతుంది |
Official Links
| లింక్ వివరం | లింక్ |
|---|---|
| అధికారిక వెబ్‌సైట్ | http://wdcw.tg.nic.in |
| నోటిఫికేషన్ PDF | Notification PDF |
| గైడ్‌లైన్స్ PDF | Guidelines PDF |
| ఆన్‌లైన్ అప్లై లింక్ | wdcw.tg.nic.in (Recruitment Section) |
| ఖాళీల జాబితా PDF | Vacancies List Pdf |
పెద్దపల్లి జిల్లాలో అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలు రాత పరీక్ష లేకుండా ఇంటర్ అర్హతతో దరఖాస్తు చేసుకోవడానికి ఇది బంగారు అవకాశం. అర్హులైన మహిళలు త్వరగా ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. ఎంపికలో ఇంటర్ మార్కులు కీలకం కాబట్టి మంచి స్కోర్ ఉన్నవారికి ఎక్కువ అవకాశాలు కలిగి ఉంటారు. ఆలస్యం చేయకుండా వెంటనే దరఖాస్తు చేసుకోండి.