పశు సంవర్ధక శాఖలో ఉద్యోగాలు | NIAB Field Assistant Recruitment 2026
NIAB Field Assistant Recruitment 2026: BRIC-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అనిమల్ బయోటెక్నాలజీ (NIAB) హైదరాబాద్ నుంచి ఒక ముఖ్యమైన నోటిఫికేషన్ విడుదలైంది. Advt. No. 15/2026 కింద ఒక ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు భర్తీ చేయనుంది. DBT ఫండింగ్‌తో నడుస్తున్న ఇంటర్ఫెరాన్ లాంబ్డా 4 (IFNL4) జన్యు ఐసోఫార్మ్పై ఫంక్షనల్ అనాలిసిస్ ప్రాజెక్టులో భాగంగా ఈ అవకాశం వచ్చింది. బయోటెక్నాలజీ, జీనోమిక్స్ రంగంలో ఆసక్తి ఉన్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఆన్లైన్ దరఖాస్తులు జూలై 1, 2026 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు.
You can still apply for this job. Please submit before the deadline.

NIAB Field Assistant Notification 2026 Overview
| వివరం | సమాచారం |
|---|---|
| సంస్థ | BRIC-National Institute of Animal Biotechnology (NIAB) |
| పోస్టు పేరు | Field Assistant |
| ఖాళీల సంఖ్య | 1 |
| ప్రాజెక్ట్ టైటిల్ | Functional analysis of a novel human IFNL4 gene isoform… |
| టెన్యూర్ | ఒక సంవత్సరం |
| దరఖాస్తు పద్ధతి | ఆన్లైన్ |
| చివరి తేదీ | 01-07-2026 (5:00 PM) |
Eligibility Criteria Explained
ఈ పోస్టుకు అవసరమైన కనీస విద్యార్హత BSc లేదా ఇంజనీరింగ్ & టెక్నాలజీలో మూడేళ్ల డిప్లొమా. అయితే, మాస్టర్స్ డిగ్రీ ఉన్నవారికి మరియు జీనోమిక్స్ ప్రాజెక్టుల్లో పరిశోధన అనుభవం, సంబంధిత పబ్లికేషన్లు ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
వయోపరిమితి: 50 సంవత్సరాలు.
గమనిక: విద్యార్హతలకు ప్రొవిజనల్ డిగ్రీ సర్టిఫికేట్ లేదా కాన్వొకేషన్ డిగ్రీ సర్టిఫికేట్ మాత్రమే చెల్లుతాయి. అనుభవ ధృవీకరణ పత్రాలు డిపార్ట్మెంట్ హెడ్ లేదా ఆఫీస్ హెడ్ నుంచి జారీ చేయాలి.
Salary Insight
ఎంపికైన అభ్యర్థికి నెలవారీ రూ. 20,000/- ఫెలోషిప్ ఇవ్వబడుతుంది. DST మార్గదర్శకాల ప్రకారం HRA కూడా వర్తిస్తుంది (వర్తించినట్లయితే). ఇది ఒక సంవత్సరం పాటు ఉంటుంది.
How to apply NIAB Field Assistant Recruitment 2026
- NIAB అధికారిక వెబ్సైట్ https://www.niab.res.in/కి వెళ్లండి.
- కెరీర్స్ లేదా రిక్రూట్మెంట్ సెక్షన్లో Advt. No. 15/2026 కోసం లింక్‌ను కనుగొనండి.
- ఆన్లైన్ అప్లికేషన్ ఫారమ్‌ను తెరిచి, అన్ని వివరాలు సరిగ్గా నింపండి.
- అవసరమైన డాక్యుమెంట్లు (స్కాన్ చేసినవి) అప్లోడ్ చేయండి.
- ఫారమ్ సమర్పించి, రసీదు సేవ్ చేసుకోండి.
చివరి నిమిషంలో సాంకేతిక సమస్యలు ఎదుర్కొనకుండా చాలా ముందుగానే అప్లై చేయాలని సలహా. హార్డ్ కాపీ పంపాల్సిన అవసరం లేదు.
Important Dates
| ఈవెంట్ | తేదీ |
|---|---|
| నోటిఫికేషన్ విడుదల | జూన్ 2026 |
| ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం | Alread started |
| దరఖాస్తు చివరి తేదీ | 01 జూలై 2026 (సాయంత్రం 5 PM) |
Official Links
| లింక్ వివరం | లింక్ |
|---|---|
| అధికారిక వెబ్సైట్ | https://www.niab.res.in/ |
| ఆన్లైన్ అప్లికేషన్ | Application Link |
| నోటిఫికేషన్ PDF | Notification PDF |
NIABలో ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు జీనోమిక్స్ మరియు బయోటెక్నాలజీ రంగంలో ఆసక్తి ఉన్న యువతకు మంచి ప్రారంభ అవకాశం. ఒక సంవత్సరం టెన్యూర్‌తో మంచి స్టైపెండ్ ఉండటం, ప్రతిష్టాత్మక సంస్థలో పని చేసే అవకాశం ఇందులో ప్రధాన ఆకర్షణలు. అర్హత ఉన్న అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవడం మంచిది. ఎంపిక ప్రక్రియ ఆన్లైన్ ఇంటర్వ్యూ ద్వారా జరుగుతుంది.